Coffee Song - "Yamaha Nagari" - Choodalani Undi - Adaptation Cover యమహానగరి గీతానికి నా కాఫీ అద్దకం

Coffee Song - "Yamaha Nagari" - Choodalani  Undi - Adaptation Cover యమహానగరి గీతానికి నా కాఫీ అద్దకం

disclaimer : the publishers of this video respectfully submit that they do not have any copyright over the original song or any other related content, except for the adaptation lyric and submit that this creation is meant for pure public entertainment only. the copyrights to the original film version/content are being held by the respective holders ... no copyright infringement intended, absolutely ... the video will be unconditionally removed in case of any objection from the respective copyright holders ..

adaptation lyrics ...

lyrics : nmrao bandi
singer : kvr anil kumar


lytrics :


సరిమా మగారి సస సనిదప సా
సరిమా మగారి సస సనిదప సా
రిమదా నిగాప సా సనిదప మగపమ రి

యమహో యమాహా కాఫీ మాధురీ

యమహో యమాహా కాఫీ మాధురీ
నమహో నమాహా నీదేం లాహిరీ
యమహో యమాహా కాఫీ మాధురీ

సుప్రభాత వేళ నీ శ్రుతికి సలుపును మది
సుప్రభాత వేళ నీ కొరకు వెదుకును మది
సుప్రభాత వేళ నీజతలో కులుకును మది

యమహో యమాహా కాఫీ మాధురీ
నమహో నమాహా ఇదేం లాహిరీ


1)


నీ ధారా పరిమళ హేలా ఆనంద భరిత మదేలా, ఓ హలా, ఓహో భళా
నీ తావి అందని వేళా, నా మోవి ఎందుకు ఢీలా, ఏమిలా ...
నీ చవీ ఎంతగా చెప్పమన్నా చాలవే మాటలన్నా
చెప్పనా ఇంతకన్నా, లేదు మిన్నా ...

ఒక పరి సరి సరి తదుపరి మరి మరి
అడుగును పరి పరి మనసిది గడుసరి
అడుగిడి ప్రియ రుచి ఒరవడిలో ...

యమహో యమాహా కాఫీ మాధురీ
నమహో నమాహా నీదేం లాహిరీ

సుప్రభాత వేళ నీ శ్రుతికి సలుపును మది
సుప్రభాత వేళ నీ జతలో కులుకును మది

యమహో యమాహా కాఫీ మాధురీ ...


2)


కాఫీకో రాగం కట్టి పాడారో కమ్మని పాట ఏమనీ, ఒహో అనీ
ఏ దైవం ఇచ్చిన వరమో, ఈ కాఫీ వచ్చెను ఇలకూ, మనకనీ ...
అందరూ చక్కగా పొగిడి మెచ్చా, గుటకలే వేసి అచ్చా
ఏం గురూ అంత టేస్టా, అవును శిష్యా

దొరుకును అట ఇట తెలియని దెవరట
ఊదుతు ఉఫ్ అని తాగుట కనువట
జనులకు ప్రియమట ప్రతి తఱిలో ...


యమహో యమాహా కాఫీ మాధురీ
నమహో నమాహా నీదేం లాహిరీ

సుప్రభాత వేళ నీ కొరకు వెదుకును మది
సుప్రభాత వేళ నీజతలో కులుకును మది

యమహో యమాహా కాఫీ మాధురీ ...


3)


ఇంగ్లాండుకి రాణీ ఐనా, ఒంగోల్లోవాణీ ఐనా, ఒక్కటే రీతిరా
అంబానీ అల్లుడు అయినా, అంబారీ మావటికైనా, ఆర్తిరా ...
అవునురా, చేతులే కొంత చాపీ, అందరూ కోరు కాఫీ
తాగుతుంటేను తాపీ, మనసు సాఫీ


అనుదిన సేవన ప్రియమని మనమన
తన మన జనముల కనమని మధువని
తనివిని తీరను జన వనిలో



యమహో యమాహా కాఫీ మాధురీ
నమహో నమాహా నీదేం లాహిరీ
యమహో యమాహా కాఫీ మాధురీ

సుప్రభాత వేళ నీ శ్రుతికి సలుపును మది
సుప్రభాత వేళ నీ కొరకు వెదుకును మది
సుప్రభాత వేళ నీజతలో కులుకును మది

యమహో యమాహా కాఫీ మాధురీ
నమహో నమాహా నీదేం లాహిరీ

yamaha nagarichoodalani undichudalani undi

Post a Comment

0 Comments